పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య | The couple committed suicide | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య

Nov 5 2015 11:49 AM | Updated on Nov 6 2018 7:56 PM

కుటుంబ కలహాలతో భార్యా భర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

కుటుంబ కలహాలతో భార్యా భర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం చిక్కడపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.


 గ్రామానికి చెందిన దంపతులు నక్క చిన్నప్ప(54), భూమవ్వ(48)ల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చిన్నప్ప తండ్రితో వీరికి ఆస్తికి సంబంధించిన విషయంపై వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన భార్యాభర్తలు బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement