ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలం కమాన గ్రామంలో ఓ బాలిక వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలం కమాన గ్రామంలో ఓ బాలిక వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికకు వివాహం జరగాల్సి ఉంది. సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ హమీద్, ఏఎస్ఐ తాహెర్ అలీ, ఐసీడీఎస్ సూపర్ వైజర్ సత్తెమ్మ, సర్పంచ్ ప్రకాశ్ తదితరులతో కలసి వచ్చి వివాహాన్ని నిలిపివేయించారు. 18 ఏళ్లు నిండకుండా వివాహం చేయడం నేరమని వారికి తెలియ జేశారు.