మార్చి 16 నుంచి టెన్త్‌ పరీక్షలు | Tenth exams from March 16 | Sakshi
Sakshi News home page

మార్చి 16 నుంచి టెన్త్‌ పరీక్షలు

Dec 4 2018 2:57 AM | Updated on Dec 4 2018 2:57 AM

Tenth exams from March 16 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 2 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫస్ట్‌ లాంగ్వేజి కాంపోజిట్‌ కోర్సు పేపర్‌–1 పరీక్ష మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు, పేపర్‌–2 పరీక్ష ఉదయం 9.30 నుంచి 10.45 వరకు జరగనుంది. ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు పరీక్ష ఉదయం 9.30 నుంచి 11.30 వరకు జరుగుతుంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సోమవారం ప్రకటన విడుదల చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement