సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో సాధారణం కంటే ఏడు డిగ్రీల వరకు రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆదిలాబాద్‌లో రాత్రి 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 11 డిగ్రీలుగా రికార్డయింది. ఖమ్మంలో 12 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. ఐదు డిగ్రీలు తక్కువగా రామగుండంలో 12, భద్రాచలంలో 13 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. హకీంపేటలో 13, హైదరాబాద్‌లో 14, మహబూబ్‌నగర్‌లో 16, హన్మకొండలో 17 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
Jan 23 2018 2:20 AM | Updated on Jan 23 2018 2:20 AM
Advertisement
Advertisement