రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విపక్షాల నేతలు పెదవి విరుస్తున్నారు. ఇది ఆశ..నిరాశల బడ్జెట్ అని అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విపక్షాల నేతలు పెదవి విరుస్తున్నారు. ఇది ఆశ..నిరాశల బడ్జెట్ అని అభిప్రాయపడ్డారు. సంక్షేమ రంగానికి, సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తామని ఎన్నికల ముందు చెప్పిన సీఎం కేసీఆర్ ఆ దిశగా కే టాయింపులు చేయలేదని విమర్శించారు. జిల్లాలో తాగు, సాగునీటి అవసరాలకు సంబంధించి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు. బడ్జెట్ లెక్కలన్నీ అంకెల గారడీని తలపిస్తున్నాయని, గత బడ్జెట్ ఖర్చు వివరాలను ఈ బడ్జెట్‌లో చూపకపోవడం ప్రభుత్వ పనితీరు అద్ధంపడు తోందని దుయ్యబట్టారు. నల్లగొండ
బడ్జెట్‌లో జిల్లాకు కేటాయింపులపై పెదవి విరుపు
రాష్ట్ర బడ్జెట్‌లో బ్రాహ్మణుల సంక్షేమానికి సంబంధించిన ప్రస్తావన లేకపోవడం శోచనీయం. ధూపదీప నైవేద్యాల పథకం, పెంచిన నెలసరి భత్యానికి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. హైదరాబాద్‌లో భ్రాహ్మణ భవన్ నిర్మిస్తామని ప్రకటించిన సీఎం, బడ్జెట్‌లో పైసా విది ల్చకపోవడం విచారకరం. సవరించిన బడ్జెట్‌లోనైనా బ్రాహ్మణుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
డి. వాసుదేవ శర్మ, అర్చక సంఘం
జిల్లా అధ్యక్షుడు
అంగన్‌వాడీల వేతనాలు పెంపు
నల్లగొండ: అంగన్‌వాడీల పోరాటం ఫలించింది. చాలీచాలనీ జీతాలతో కాలం వెళ్ల దీస్తున్న అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాల వేతనాలు పెంచుతూ రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. దీనివల్ల జిల్లాలోని 4,202 మంది అంగన్ వాడీ కార్యకర్తలు , 1800 మంది ఆయాలకు మేలు చేకూరనుంది. కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్‌ను కలిసిన అంగన్ వాడీకార్యకర్తలు, ఆయాలు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఆరేళ్ల నుంచి జీతాలు పెంచలేదని, అరకొర జీతాలతో జీవనం సాగించడం కష్టంగా ఉందని తమ ఆవేదనను సీఎం ఎదుట వ్యక్తం చేయగా పెంచుతామని సీఎం హామీ ఇచ్చారు. ఈమేరకు బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిధులు కేటాయించారు.
దీంతో పాటు అంగన్ వాడీ కేంద్రాల నిర్వహణ సంవత్సరానికి కలిపి రూ. వెయ్యి కేటాయించారు. జిల్లాలో అంగన్ వాడీ కేంద్రాలు 3,801, మినీ అంగ న్ వాడీ కేంద్రాలు 401 ఉన్నాయి. ఈ కేంద్రాల్లో అంగన్ వాడీ కార్యకర్తలు 4,202 మ ంది పనిచేస్తున్నారు. వీరికి ప్రస్తుతం నెలసరి వేతనం రూ.4,200 చెల్లిస్తున్నారు. దీనిని రూ. 7 వేలకు పెంచారు. ప్రస్తుతం చెల్లిస్తున్న జీతం కంటే రూ.2,800 అదనంగా పెంచారు. ఈ పెంపు కారణంగా నెలకు జీతాల వ్యయం రూ.1,17,65,600 పెరిగింది. జిల్లాలో ఆయాలు (హెల్పర్స్) 3,801 మంది ఉన్నారు. వీరికి ప్రస్తుతం నెలసరి వేతనం రూ.22 00 చెలిస్తున్నారు. దీనిని రూ.4 వేలకు పెంచారు. ఒక్కో ఆయాకు నెలకు వేతనం రూ.1800 పెంచారు. ఈ ఆయా లకు చెల్లిస్తున్న నెలవారీ వేతనాల వ్యయం రూ.68,41,800 పె రిగింది. ఇదిలాఉంటే అంగన్ వాడీ కేంద్రాల మెయింటెన్స్ గ్రాంటు
(నిర్వహణ ఖర్చుల కి ంద) ఏడాదిగాను రూ.వెయ్యి ఇవ్వనున్నారు. జిల్లాలోని 4,202 అంగన్ వాడీ కేంద్రాలకు ఏడాదికి మొత్తం మీద రూ.5,04,24 వేల గ్రాంటు రానుంది.
జీతాల పెంపు హర్షణీయం
అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాల జీతాలు పెంచక దాదాపు ఆరేళ్లైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అంగన్‌వాడీలకు జీతాలు పెంచడం హర్షణీయం. అంగన్ వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం నిర్వహణ గ్రాంటు మ ంజూరు చేయడం కూడా కొంతమేర సమస్యలు తీరుతాయి.
- ఎన్. మోతీ, ఐసీడీఎస్ పీడీ
ప్రభుత్వ అసమర్థత కనిపిస్తోంది
తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ చూపడం ప్రభుత్వం అసమర్థతకు నిదర్శనం. శ్రీశైలం ఎడమకాల్వ సొరంగ మార్గం పనులకు, ఫ్లోరైడ్ నివారణకు కేటాయింపులు జరపలేదు. శ్రీరాంసాగర్ లక్షల ఎకరాలకు ఆవశక్యతను ప్రాజెక్టు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఉత్పాదకత రంగాల మీద బడ్జెట్ కేటాయింపులు సరిపడా లేవు.
- గట్టు శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్ సీపీ
రాష్ర్ట ప్రధానకార్యదర్శి
బలహీన వర్గాలను మోసం చేశారు
ఈ బడ్జెట్ పేద ప్రజలను మోసం చేసే విధంగా ఉంది. అంకెల గారడీ తప్ప అభివృద్ధి శూన్యం. గత సంవత్సర బడ్జెట్ వివరాలు ఈ బడ్జెట్‌లో ఇవ్వకపోవడం శోచనీయం. దేశ చరిత్రలో ఏ అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ విధంగా జరగలేదు. గత బడ్జెట్ పద్దుల గురించి ఈ బడ్జెట్‌లో ఖర్చు వివరాలు చూపకపోవడం ప్రభుత్వం దగా చేస్తుందని అర్థమవుతోంది. కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇళ్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్ బడ్జెట్‌లో ఒక్కరూపా యి కూడా కేటాయించలేదు. బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం మొండిచేయి చూపిం ది.
- బూడిద భిక్షమయ్య గౌడ్, డీసీసీ అధ్యక్షుడు
బంగారు తెలంగాణ సాకారం
టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు బడ్జెట్ కేటాయింపులు చేశారు. మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, నక్కల గండి, ఎస్‌ఎల్‌బీసీ, ఇతర అభివృద్ధి సంక్షేమ పథకాలు మేళవింపు చేసి అన్ని రంగాలకు సముచితమైన స్థానం కల్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు ఇంత భారీ స్థాయిలో నిధులు ఎప్పుడు కేటాయించ లేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌తో బంగారు తెలంగాణ కల సాకారమవుతుంది.
- బండా నరేందర్ రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
ఇది అంకెల బడ్జెట్
జిల్లా సమగ్రాభివృద్ధికి, సాగునీటి ప్రాజెక్టులకు సరైన నిధులను కేటాయించ లేదు. ఎన్నికల హామీలకు సంబంధించి ఏ ఒక్క అంశానికి న్యాయం చేకూర్చే విధంగా బడ్జెట్‌లో కేటాయింపులు జరగలేదు. దళితులకు భూపంపిణీ, కేజీ నుంచి పీజీ విద్య, రైతుల ఆత్మహత్యలు, ప్ర కృతి వైపరీత్యాల చెల్లింపులకు బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. దళిత, గిరిజన , మైనార్టీ, బీసీల సంక్షేమానికి సరైన నిధులు ఇవ్వలేదు.
- నంద్యాల నర్సింహారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి
మాటలు తప్ప చేతల్లేవు
మసిపూసి మారేడుకాయ చేసిన విధంగా ప్రభుత్వం బడ్జెట్ లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం మాటలు తప్ప చేతల్లేవు. నిరుద్యోగుల ప్రస్తావన లేదు. పేద ప్రజల సంక్షేమాన్ని నీరుగార్చే విధంగా బడ్జెట్ కేటాయింపులు చేశారు. సంక్షేమ రంగానికి పెద్ద పీట వేస్తామని చెప్పిన సీఎం ఆ దిశగా నిధులు కేటాయించకపోవడం విచారకరం.
- బిల్యా నాయక్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు
ప్రజలను విస్మరించిన బడ్జెట్ ఇది
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రజలను పూర్తిగా విస్మరించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తామని చెప్పి భారీ నీటిపారుదలశాఖకు కేవలం రూ. 450 కోట్లు మాత్రమే కేటాయించారు. రైతులను విస్మరించి ఆత్మహత్యల గురించి మాట్లాడకపోవడం బాధాకరం. దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేస్తామని గత బడ్జెట్‌లో రూ. వెయ్యి కోట్లు కేటాయించి కేవలం 1400 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేశారు. ఈ బడ్జెట్‌లో కేవలం రూ.వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ బడ్జెట్ అంకెల గారడీగా ఉంది.
రమావత్ రవీంద్రకుమార్, సీపీఐ శాసనసభాపక్ష నేత
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కేటాయింపులు
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు. ఎన్నికల ముందు సాగు,తాగునీటి ప్రాజెక్టులు, చెరువుల మరమ్మతులకు నిధులు ఇస్తామని, బడ్జెట్‌లో పూర్తి స్థాయి కేటాయింపులు చేయలేదు. ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలు సాగునీటిని ఇస్తామని ప్రస్తావనే లేదు. కేటాయించిన నిధులను విడుదల చేసి ఖర్చుచేయాలి. ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు అనుగుణంగా నిధుల కేటాయింపులు చేయాలి. - మల్లేపల్లి ఆదిరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి
లేవు
ఒక్కో ప్రాజెక్టుకు ఇలా... గుట్టకు మళ్లీ రూ.100 కోట్లు
యాదగిరిగుట్ట అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఈసారి బడ్జెట్‌లో మరో రూ.100 కోట్లు చూపెట్టారు. గుట్ట డెవలప్‌మెంట్ అథారిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు ఈటెల. అయితే, గత ఏడాది కూడా అంతే కేటాయించగా, అందులో ఖర్చు కాని నిధులను కలిపి ఈ ఏడాది ఖర్చు చేస్తారని, దీనికి తోడు కార్పొరేట్ సంస్థల సాయం కూడా కలుస్తుంది కనుక గుట్ట అభివద్ధి పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని అధికార వర్గాలు అంటున్నాయి.
నిధుల్లో కోత
నాగార్జునసాగర్ ఆధునికీకరణకు భారీ స్థాయిలో నిధుల కోత విధించారు. గత ఏడాది ఇందుకోసం రూ.425 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి దానిని రూ.210 కోట్లకు తగ్గించింది. అందులో ప్రాజెక్టు ఆధునికీకరణకు కేటాయించింది రూ.154.68 కోట్లే. మరో రూ.12.50 కోట్లు డ్యాం భద్రత కోసం కేటాయించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చివరి భూముల వరకు నీరుపారే పరిస్థితి లేకపోగా, ఈసారి బడ్జెట్ తక్కువ కావడంతో ఇప్పటికి నీరు పారుతున్న కాల్వల మరమ్మతులు కూడా కష్టమేననే భావన వ్యక్తమవుతోంది.
పవర్‌ప్లాంట్‌కు లైన్‌క్లియర్
ఈ ఏడాది మొత్తం 6600 మెగావాట్ల సామర్థ్యం కల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని, ఇందుకోసం విద్యుత్ శాఖకు 7,800 కోట్లకు పైగా కేటాయిస్తున్నామని చెప్పడం ద్వారా జిల్లాలో నిర్మించ తలపెట్టిన దామరచర్ల పవర్‌ప్లాంటు పనులు ఈ ఏడాదే ప్రారంభిస్తామని చెప్పారు ఈటెల. అయితే, ఈ ప్రాజెక్టును భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్)తో కలిసి చేపడతామని, దేశంలోనే తొలిసారి జీటూజీ (గవర్నమెంట్ టు గవర్నమెంట్) పద్ధతిలో చేపట్టిన ఈ ప్రాజెక్టును ప్రధాని కూడా ప్రశంసించారని చెప్పారాయన. ఇక, హైదరాబాద్-వరంగల్ మధ్య పారిశ్రామిక కారిడార్‌ను నిర్మాణం చేపడతామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఈ కారిడార్ ద్వారా జిల్లాలోని బీబీనగర్, భువనగిరి, ఆలేరు ప్రాంతాల్లో అభివద్ధి జరిగే అవకాశముంది. మరోవైపు రాచకొండ గుట్టల గురించి బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన లేకపోయినా, అసెంబ్లీ వాయిదా తర్వాత ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాత్రం రాచకొండ గృట్టల అభివద్ధి గురించి ప్రస్తావించారు. అక్కడ 35వేల ఎకరాల్లో ఎలక్ట్రానిక్, హార్డ్‌వేర్ పార్కుతో పాటు చిత్రనగిరిని ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించడం గమనార్హం.
తగ్గిన కేటాయింపులు..
మరో పెద్ద ప్రాజెక్టు అయిన ఎస్సారెస్పీ రెండోదశకు ఈసారి కూడా కేటాయింపులు తగ్గాయి. గత ఏడాది బడ్జెట్ కన్నా ఈసారి రూ.రెండు కోట్లు తగ్గించి కేవలం రూ.23 కోట్లతోనే సరిపెట్టారు. దాదాపు రూ.1000 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు గత నాలుగేళ్లలోనూ కలిపి కేవలం రూ.150 కోట్లే కేటాయించిన నేపథ్యంలో జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలకు తాగు, సాగునీరు అందడం ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.