తెలంగాణ బడ్జెట్‌ 2020-21 హైలైట్స్‌

Telangana State Budget 2020 Live Updates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ ప్రతిపాదనలను శాసనసభలో ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్దే లక్ష్యంగా వాస్తవిక కోణంలో బడ్జెట్‌ రూపొందించినట్టు హరీష్‌ తెలిపారు.

ఆయన ప్రసంగిస్తూ.. ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుంది. బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. బడ్జెట్‌ అంటే కాగితాల లెక్కలు కాదు.. సామాజిక స్వరూపం’అని మంత్రి పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక ఏడాదికి గాను రాష్ట్ర బడ్జెట్‌ 1,82,914.42 కోట్లుగా హరీష్‌రావు పేర్కొన్నారు. అదేవిధంగా రెవిన్యూ వ్యయం 1,38,669.82 కోట్లు, క్యాపిటల్ వ్యయం 22,061.18 కోట్లు, ఆర్ధిక లోటు 33,191.25 కోట్లుగా మంత్రి వెల్లడించారు. ఇక ఆర్థిక మంత్రి హోదాలో హరీష్‌రావు తొలిసారి శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా.. మండలిలో శాసనసభా వ్యవహా రాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. 

హరీష్‌రావు ప్రసంగం హైలైట్స్‌:

  • గతేడాది నుంచి దేశవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ప్రభావం ఉంది
  • కేంద్రం నుంచి జీఎస్టీ రావడం లేదు
  • 2019-20 వృద్ధి రేటు 6.5శాతంగా ఉంది
  • గత బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన అంచనాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి నాటికి ఖర్చు రూ.1.36 లక్షల కోట్లు
  • 2018-19లో 14.3% ఉన్న జీఎస్‌డీపీ 19-20కి 12.6% తగ్గింది
  • తెలంగాణ ఆర్థిక బడ్జెట్‌ 2020-21 ఏడాదికి గాను 1,82,914.42 కోట్లు
  • రెవిన్యూ వ్యయం 1,38,669.82 కోట్లు
  • క్యాపిటల్ వ్యయం 22,061.18 కోట్లు
  • ఆర్ధిక లోటు 33,191.25 కోట్లు
  • సవరించిన అంచనా ప్రకారం.. 2019-20కి చేసిన అంచనా వ్యయం 1,42,152.28 కోట్లు
  • రూ.25వేలు రుణం ఉన్న రైతులకు ఏకకాలంలో మాఫీ
  • ఈనెలలోనే రుణమాఫీ పూర్తి చేస్తాం
  • రూ.25వేల నుంచి లక్ష లోపు ఉన్న రుణాలు 4 విడతలుగా పంపిణీ
  • చెక్కులను స్థానిక ఎమ్మెల్యేలు రైతులకు అందిస్తారు
  • ఎంత ఖర్చైనా సరే కందులను కొనుగోలు చేస్తాం
  • రైతుబంధు పథకానికి రూ.14వేల కోట్లు కేటాయింపు
  • మూసీ రివర్‌ఫ్రంట్ కోసం రూ.10వేల కోట్లు కేటాయింపు
  • మున్సిపల్‌శాఖకు 14,809 కోట్లు కేటాయింపు
  • హైదరాబాద్ అభివృద్ధి కోసం వచ్చే ఐదేళ్లలో రూ.50వేల కోట్లు
  • పాఠశాల విద్య కోసం రూ.10,421 కోట్లు
  • ఉన్నత విద్యాశాఖకు రూ.1,723 కోట్లు
  • హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలు 118 నుంచి 350కి పెంపు
  • వైద్య రంగానికి రూ.6,156 కోట్లు
  • పంచాయతీరాజ్‌ శాఖకు రూ.23,005 కోట్లు
  • కల్యాణలక్ష్మీ పథకానికి రూ.1,350 కోట్లు కేటాయింపు
  • గృహ నిర్మాణానికి రూ.11,917 కోట్లు
  • మైనారిటీల కోసం రూ.1,518 కోట్లు 
  • ఎస్సీ సంక్షేమం కోసం రూ.16534.97 కోట్లు
  • ఎస్టీ సంక్షేమం కోసం రూ.9,771.27 కోట్లు
  • ఆసరా పెన్షన్ల కోసం రూ.11,750 కోట్లు 
  • సాగునీటి రంగానికి రూ.11,054 కోట్లు
  • రవాణా, రోడ్లుభవనాలశాఖకు రూ.3494 కోట్లు
  • పోలీస్‌శాఖకు రూ.5,852 కోట్లు కేటాయింపు
  • విద్యుత్‌శాఖకు రూ.10,416 కోట్లు కేటాయింపు
  • అటవీశాఖకు రూ.791 కోట్లు కేటాయింపు
  • పారిశ్రామిక రంగ అభివృద్ధికి రూ.1,998 కోట్లు
  • ఎస్‌డీపీ నిధుల కోసం రూ.480 కోట్లు కేటాయింపు
  • మైక్రో ఇరిగేషన్ కోసం రూ.600 కోట్లు కేటాయింపు
  • పాడిరైతుల ప్రోత్సాహం కోసం రూ.100 కోట్లు
  • మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం రూ.1,200 కోట్లు
  • పశుపోషణ, మత్స్యశాఖకు రూ.1,586.38 కోట్లు
  • వచ్చే విద్యా సంవత్సరం నుంచి 71 మైనారిటీ జూనియర్ కళాశాలలు ఏర్పాటు
  • ఈ ఏడాది నుంచి 55 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్
  • రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా రాయదుర్గం - శంషాబాద్
  • బీహెచ్‌ఈఎల్‌-లక్డీకాపూల్ వరకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి
  • రాష్ట్రంలో 2,72,763 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి
  • దేశంలో తలసరి విద్యుత్ వినియోగం 1181 కాగా రాష్ట్రంలో 1896 యూనిట్లు
  • హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలు 118 నుంచి 350కి పెంపు
  • మరో 232 దవాఖానాలు త్వరలో ప్రారంభిస్తాం
  • తెలంగాణలో కరోనా వైరస్ లేదు
  • ఇప్పటి వరకు 12,427 పరిశ్రమలకు అనుమతులిచ్చాం
  • 14 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి
  • ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లకు పెంపు
  • ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బోర్డు

హరీష్‌రావు బడ్జెట్‌ ప్రసంగం ముగియడంతో శాసనసభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top