తెలంగాణ పోలీసులకు వారాంతపు సెలవు | Telangana policemen get weekly day off | Sakshi
Sakshi News home page

తెలంగాణ పోలీసులకు వారాంతపు సెలవు

Jun 2 2014 12:54 PM | Updated on Aug 21 2018 5:46 PM

తెలంగాణ పోలీసులకు వారాంతపు సెలవు - Sakshi

తెలంగాణ పోలీసులకు వారాంతపు సెలవు

పోలీసు సిబ్బందికి శుభవార్త. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ...పోలీసులకు వరాల జల్లు కురిపించారు.

హైదరాబాద్ :  పోలీసు సిబ్బందికి శుభవార్త. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ...పోలీసులకు వరాల జల్లు కురిపించారు. పోలీసులకు వీక్లీ ఆఫ్లతో పాటు ట్రాఫిక్ పోలీసులకు నెలవారీ మెడికల్ అలవెన్సులు ప్రకటించారు. హైదరాబాద్ శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని, ఒకే గొడుగు కిందికి పోలీస్ వ్యవస్థను తీసుకు వస్తామని కేసీఆర్ తెలిపారు.

కాగా తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమాన వేతనాలు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధిలో అందరం భాగస్వాములు అవుదామని, ఆశించిన ప్రగతి రావాలంటే ఉద్యోగులు సహకరించాలన్నారు. త్వరలో ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్స్ ఇస్తామని తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement