మీడియాకు దూరంగా మంత్రులు | telangana ministers distance to media | Sakshi
Sakshi News home page

మీడియాకు దూరంగా మంత్రులు

Dec 14 2014 3:10 AM | Updated on Oct 9 2018 6:34 PM

మీడియాకు దూరంగా మంత్రులు - Sakshi

మీడియాకు దూరంగా మంత్రులు

తెలంగాణ ఉద్యమం సమయంలో మీడియా ప్రతినిధులు కనిపిస్తే చాలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన నేతలు ఇప్పుడు మంత్రులయ్యాక మైకులు కనిపిస్తే చాలు దూరం దూరం పోతున్నారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో మీడియా ప్రతినిధులు కనిపిస్తే చాలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన నేతలు ఇప్పుడు మంత్రులయ్యాక మైకులు కనిపిస్తే చాలు దూరం దూరం పోతున్నారు. విలేకరులు ఏం అడుగుతారో, వారికి ఏం చెబితే ఏ ఇబ్బందులు వచ్చిపడతాయోనన్న శంక వారిని పట్టి పీడిస్తోంది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆ మధ్య మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఓ విలేకరి రుణమాఫీ గురించి అడిగినప్పుడు ఏడాదిలో పూర్తి చేస్తామంటూ వ్యాఖ్యానించడంతో ముఖ్యమంత్రి ఆయనపై ఇంతెత్తున లేచారట! ఆ సంగతి మంత్రులకూ తెలిసింది. ఎందుకొచ్చిన తంటా.. అసలు ఏమీ మాట్లాడకపోతే ఏ బాధ ఉండదు కదా అని వారు భావిస్తున్నారు. దీంతో సచివాలయంలో మీడియా పాయింట్ దగ్గర ఇప్పుడు మాట్లాడేవారు కరువయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement