మంత్రి కేటీఆర్ ఆకస్మిక తనిఖీ : వైద్య సిబ్బంది సస్పెన్షన్ | telangana it minister immediate checks | Sakshi
Sakshi News home page

మంత్రి కేటీఆర్ ఆకస్మిక తనిఖీ : వైద్య సిబ్బంది సస్పెన్షన్

May 1 2015 3:54 PM | Updated on Aug 30 2019 8:24 PM

మంత్రి కేటీఆర్ ఆకస్మిక తనిఖీ : వైద్య సిబ్బంది సస్పెన్షన్ - Sakshi

మంత్రి కేటీఆర్ ఆకస్మిక తనిఖీ : వైద్య సిబ్బంది సస్పెన్షన్

ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ శుక్రవారం పర్యటించారు.

టేకులపల్లి : ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ శుక్రవారం పర్యటించారు. ఆయన తొలుత సులానగర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో ఒక ఫార్మసిస్టు, ముగ్గురు కాంట్రాక్టు నర్సులు మాత్రమే వైద్య కేంద్రంలో ఉన్నారు.

 

ఆస్పత్రి ఆవరణంతా చెత్త, చెదారంతో నిండి ఉండటంతో సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో రోగులకు అందుబాటులో లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగాను డాక్టర్ శ్రీనునాయక్, యూడీసీ ఉపేందర్, ఆఫీస్ సబార్డినేట్ నళిని కమలను సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టేకులపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సైతం మంత్రి పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement