ఏ చర్యలు తీసుకుంటారో తేల్చుకోండి: హైకోర్టు

Telangana High Court Orders Take Action On Doctors Over Pregnant Death In Jogulamba District - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన గర్భిణి జెనీలా (20) పురుటినొప్పులతో బాధపడుతున్నా కరోనా వైరస్‌కు భయపడి వైద్యం అందించని వైద్యులపై ఏ చర్యలు తీసుకోవాలో ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని హైకోర్టు స్పష్టంచేసింది. క్రిమినల్‌ కేసులు నమోదు చేసి వి చారణ తర్వాత చర్యలు తీసుకోవాలని తాము ఆ దేశాలు జారీ చేయగలమని, అయితే కరోనాకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యుల్లో మనోధైర్యం దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో ఉత్తర్వులు ఇవ్వ డం లేదని తెలిపింది. క్రిమినల్‌ కేసు నమోదా లేక శాఖాపరంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునేదీ ప్రభుత్వమే తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.

వైద్యం అందకే జెనీలా మరణించిందని, బాధ్యులపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ న్యాయవాదులు కరణం కిషోర్‌కుమార్, శ్రీనిత పూజారి దాఖలు చేసిన రెండు ప్రజాహిత వ్యాజ్యాలు గురువారం విచారణకు వచ్చాయి. ప్రభుత్వం అంబులెన్స్‌లను ఏర్పాటు చేసిందని దాఖలు చేసిన కౌంటర్‌తో సంతృప్తికరంగా ఉన్నందున పిల్స్‌పై విచారణను ముగిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top