'ఉస్మానియా' నుంచి రోగుల తరలింపుపై పరిశీలన | telangana health minister visits osmania hospital | Sakshi
Sakshi News home page

'ఉస్మానియా' నుంచి రోగుల తరలింపుపై పరిశీలన

Jul 24 2015 3:56 PM | Updated on Sep 3 2017 6:06 AM

ఉస్మానియా ఆస్పత్రి వార్డులను, అందులోని రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించేందుకు గల అవకాశాలను సర్కారు పరిశీలిస్తోంది.

ఉస్మానియా ఆస్పత్రి వార్డులను, అందులోని రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించేందుకు గల అవకాశాలను సర్కారు పరిశీలిస్తోంది. ఉస్మానియా ఆస్పత్రికి త్వరలో కొత్త టవర్స్ను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి శుక్రవారం ఉదయం నాంపల్లి ఏరియా ఆస్పత్రిని సందర్శించారు.

అక్కడి సౌకర్యాలు, వసతులపై అధికారులతో మాట్లాడారు. అనంతరం ఆయన మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రిని పరిశీలించారు. సాయంత్రం ఆయన వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిని పరిశీలించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement