‘ఎన్‌టీపీసీలానే వేతనాలివ్వాలి’ | telangana engineers demands to pay salaries as NTPC | Sakshi
Sakshi News home page

‘ఎన్‌టీపీసీలానే వేతనాలివ్వాలి’

May 18 2014 2:57 AM | Updated on Sep 2 2017 7:28 AM

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్‌టీపీసీ) తరహాలో తమకూ వేతనాలు ఇవ్వాలని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల సంఘం డిమాండ్ చేసింది.

 సాక్షి, హైదరాబాద్: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్‌టీపీసీ) తరహాలో తమకూ వేతనాలు ఇవ్వాలని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల సంఘం డిమాండ్ చేసింది. ట్రాన్స్‌కో సీఎండీ సురేష్‌చందాను కలిసి సంఘం అధ్యక్షుడు శివాజీ ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం యాజమాన్యం ఇవ్వచూపుతున్న 22 శాతం ఫిట్‌మెంట్ తమకు సమ్మతం కాదన్నారు. ఎన్‌టీపీసీ తరహాలో వేతనాలు, 33 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలన్నారు. తమ డిమాండ్ల కోసం మంగళవారం నుంచి విద్యుత్ సౌధలో ధర్నా చేపట్టనున్నట్టు ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement