బంగారు తెలంగాణకు అనుగుణంగా బడ్జెట్ | Telangana budget | Sakshi
Sakshi News home page

బంగారు తెలంగాణకు అనుగుణంగా బడ్జెట్

Mar 13 2015 1:09 AM | Updated on Sep 2 2017 10:43 PM

బంగారు తెలంగాణ సాదనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్టు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి
 జడ్చర్ల: బంగారు తెలంగాణ సాదనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్టు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన జడ్చర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్నివర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని తమ ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి చక్కటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందన్నారు. బడ్జెట్‌లో వైద్య రంగానికి అధిక ప్రాధాన్యం కల్పించామన్నారు.
 
 
 కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించేలా చర్యలు తీసుకుని ,సీఎం కేసీఆర్ ఆశించిన విధంగా ప్రభుత్వ ఆసుపత్రులను అబివృద్ధి పరుస్తామన్నారు. మండలస్థాయిలో ఉన్న పీహెచ్‌సీల సామర్థ్యాన్ని 30 పడకలకు పెంచుతామని.. నియోజకవర్గ కేంద్రాలలోని 30 పడకల ఆసుపత్రులను వంద పడకలకు, జిల్లా కేంద్రాలలోని ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో అబివృద్ధి పరుస్తామన్నారు.
 
 ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ అభ్యర్థి దేవీప్రసాద్ గెలుపు ఖాయమన్న ధీమాను వ్యక్తం చేశారు.తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన దేవీప్రసాద్‌ను ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు పట్టభద్రులు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు జయప్రద, నాయకులు గోవర్దన్‌రెడ్డి, కోడ్గల్ యాదయ్య, పిట్టల మురళి, రంజిత్‌బాబు, జంగయ్య, చాంద్‌ఖాన్, నర్సిములు, శ్రీకాంత్, ఉమాశంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement