 
															పలు చోట్ల మొరాయించిన ఈవీఎంలు
తెలంగాణ ప్రాంతంలోని 119 అసెంబ్లీ, 17 లోక్సభ నియోజకవర్గాలకు బుధవారం ఉదయం 7. గంటలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది.
	తెలంగాణ ప్రాంతంలోని 119 అసెంబ్లీ, 17 లోక్సభ నియోజకవర్గాలకు బుధవారం ఉదయం 7. గంటలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అయితే వివిధ ప్రాంతాలలోని పోలింగ్ బూత్లలో ఈవీఎంలు మొరాయించాయి. దాంతో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లతో పోలింగ్‌బూత్ వద్ద క్యూ లైన్లు పెరుగుతున్నాయి. ఎన్నికల ఏర్పాట్లు విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా... ఈవీఎంలను సరిచేసేందుకు ఎన్నికల సిబ్బంది తంటాలు పడుతున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంను ఎన్నికల సిబ్బంది సరి చేశారు. తెలంగాణలోని వివిధ జిల్లాలోని పోలింగ్ బూత్లలో ఈవీఎంలు మొరాయించాయి. వాటి వివరాలు.
	
	హైదరాబాద్: హబ్సీగూడ పోలింగ్ బూత్ నెం 181తోపాటు తుకారంగేటులోని బూత్ నెం. 6...కూకట్పల్లిలోని బూత్ నెం.46...ఎల్బీనగర్ 82/A...ఖైరతాబాద్ ఆనంద్‌నగర్ 83 బూత్‌లలోని ఈవీఎంలు మొరాయించాయి. దాంతో ఓటింగ్ వేసేందుకు వచ్చిన ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చైతన్యపూరిలో కూడా ఈవీఎంలు మొరాయించాయి. దాంతో ఓటర్లు వెనుదిరిగారు.
	
	ఆదిలాబాద్ జిల్లా: మందమర్రి రామకృష్ణాపూర్‌లోని....68, 69 పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించాయి. దాంతో ప్రారంభం కానీ పోలింగ్.
	
	ఖమ్మం జిల్లా: కొణిజర్ల పెద్దమునగాలలో పనిచేయని ఈవీఎంలు.
	                       భద్రాచలం నన్నపనేని హైస్కూల్‌లో పనిచేయని ఈవీఎం
	                       పినపాక కరకగూడెంలో పనిచేయని ఈవీఎం
	                      అశ్వరావుపేట, దమ్మపేటలో ఈవీఎంలు మొరాయింపు
	                      కొత్తగూడెం రేజర్లలో పనిచేయని ఈవీఎంలు
	
	మహబూబ్‌నగర్ జిల్లా : నాగర్‌కర్నూల్‌లో..87, 88 పోలింగ్ కేంద్రాల్లో పనిచేయని ఈవీఎంలు.
	                                     వీపనగండ్లలో 148 బూత్‌లోని ఈవీఎం.
	                                    పెద్దకొత్తపల్లి మండలం కల్వకొల్లులో 47బూత్‌లో..పనిచేయని ఈవీఎంలు
	
	మెదక్ జిల్లా : 104 పోలింగ్ కేంద్రంలో పనిచేయని ఈవీఎం.
	                      చినమండవ, మక్కేపల్లి గ్రామాలలో మొరాయించిన ఈవీఎంలు.
	                     మంగల్‌పేటలోలోని 141బూత్‌లో ఈవీఎం మొరాయింపు
	                     పెబ్బేరు మండలం శ్రీరంగపూర్‌లో మొరాయించిన ఈవీఎం
	
	నల్గొండ జిల్లా: నాంపల్లి 247పోలింగ్ బూత్‌లో...పనిచేయని ఈవీఎం.
	                    నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో ఈవీఎంలు మోరాయింపు
	                    పెన్‌పహాడ్ మండలం చీవెళ్లలో పనిచేయని ఈవీఎం
	                    మునగాల, చిలుకూరులో మొరాయించిన ఈవీఎం
	                    నకిరేకల్ బూత్‌నెం.1లో మొరాయించిన ఈవీఎం
	                    మిర్యాలగూడ నియోజకవర్గంలోని రాయలపెంట, గాంధీనగర్‌లో ఈవీఎంల మొరాయింపు
	
	రంగారెడ్డి జిల్లా: వికారాబాద్ ఆలంపల్లిలో పనిచేయని ఈవీఎం.
	                         పెద్దేముల్ మండలం హనుమాపూర్‌లో పనిచేయని ఈవీఎంలు
	                         ధారూర్ కుక్కిందలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలలో సాంకేతికలోపం... గంటన్నర ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం
	
	వరంగల్ జిల్లా: జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల పనిచేయని ఈవీఎంలు
	                      భూపాలపల్లి మండలం నాగారంలో పనిచేయని ఈవీఎంలు
	                      రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపురం గ్రామంలో ఈవీఎం మొరాయింపు
	
	కరీంనగర్ జిల్లా: సిరిసిల్ల 123 పోలింగ్ కేంద్రంలో మొరాయించిన ఈవిఎం
	                        మల్యాల మండల కేంద్రంలోని 4 పోలింగ్ కేంద్రాలలో మొరాయించిన ఈవిఎంలు, ప్రారంభంకాని  పోలింగ్
	                        ముస్తాబాద్ లోని 208 పోలింగ్ కేంద్రంలో నిలిచిపోయిన పోలింగ్ , ఓటర్ల ఆందోళన

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
