నిజామాబాద్ పట్టణంలోని అర్సవల్లి కాలనీ వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృత్యువాతపడ్డారు.
రెంజల్ (నిజామాబాద్) : నిజామాబాద్ పట్టణంలోని అర్సవల్లి కాలనీ వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృత్యువాతపడ్డారు. వివరాల ప్రకారం.. నిజామాబాద్ పట్టణానికి చెందిన రజిత రెంజల్ మండలం నీల గ్రామంలోని ప్రైమరీ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు.
కాగా సోమవారం సాయంత్రం స్కూల్లో విధులు ముగిసిన తర్వాత ఆటోలో నిజామాబాద్‌కు ప్రయాణమయ్యారు. అయితే అర్సవల్లి కాలనీ వద్ద ఆటోను ఎదురుగా వచ్చిన డీసీఎం మినీ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రజిత అక్కడికక్కడే మృతి చెందారు.