
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (ఫైల్ ఫోటో)
సాక్షి, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వార్త జోరందుకుంది. ఇప్పటికే వివిధ పార్టీలు ముందస్తు ఎన్నికలకు సమయాత్తమవుతుండగా.. మరికొన్ని పార్టీలు విభేదిస్తున్నాయి. తాజాగా ముందస్తు ఎన్నికలపై సీపీఎం పార్టీ స్పందించింది. ముందస్తు ఎన్నికలకు పోవాల్సిన అవసరమేముందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో బీఎల్‌ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలకు పోవడమంటే ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనని అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రజలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ముందస్తు ఎన్నికలు జరిగితే లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలన పిచ్చోడి చేతిలో రాయి లాంటిదని విమర్శించారు. తెలంగాణలో సామాజిక న్యాయమంటే గొర్రెలు, బర్రెలు పంపిణీ చేయడమేనా? వారికి అధికారం వద్దా? అని తమ్మినేని ప్రశ్నించారు.