ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తోడ్పాటు అందించే దిశగా ఈ ఏడాది ఆఖరు నాటికి టీ-హబ్ పేరిట ప్రత్యేకంగా ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు.
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తోడ్పాటు అందించే దిశగా ఈ ఏడాది ఆఖరు నాటికి టీ-హబ్ పేరిట ప్రత్యేకంగా ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. సాంకేతిక నైపుణ్యాలు ఉన్న వారు వ్యాపార మెళకువలు కూడా నేర్చుకుని వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన వివరించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ), ట్రిపుల్ ఐటీ, నల్సార్ సహకారంతో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం ఇక్కడ ఐఎస్‌బీలో టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ కోర్సును ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. హైసియా, ట్రిపుల్ ఐటీ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఐఎస్‌బీలో ఆగస్టు 30, 31లో స్టార్టప్ ఫెస్టివల్ నిర్వహిస్తుందని కేటీఆర్ చెప్పారు. ఐఎస్‌బీ డీన్ అజిత్ రంగ్నేకర్, నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ బోర్డ్ సలహాదారు హెచ్‌కే మిట్టల్, పలువురు ఔత్సాహిక వ్యాపారవేత్తలు, ఏంజెల్ ఇన్వెస్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.