మాటలు కోటలు దాటుతున్నా... | sunnam rajaiah comments on ts budget | Sakshi
Sakshi News home page

మాటలు కోటలు దాటుతున్నా...

Mar 11 2015 11:51 AM | Updated on Sep 2 2017 10:40 PM

తెలంగాణ ఆర్థిక బడ్జెట్ లో అంకెల గారడీ చేశారని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య విమర్శించయారు.

హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక బడ్జెట్ లో అంకెల గారడీ చేశారని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య విమర్శించయారు. మాటలు కోటలు దాటుతున్నా కాళ్లు గడప దాటడంలేదన్న చందంగా బడ్జెట్ ఉందన్నారు. గత బడ్జెట్ లో జరిపిన కేటాయింపులు ఖర్చు చేయలేదని మళ్లీ వాటినే ఈ బడ్జెట్ లో చూపించారని ఆరోపించారు. సేవా రంగాన్ని పూర్తిగా విస్మరించారన్నారు.

పెరుగుతున్న ధరలకు హాస్టల్ విద్యార్థులకు ఉపకార వేతనాలు పెంచలేదన్నారు. అణగారిన వర్గాలకు నామమాత్రంగా కేటాయింపులు జరిపారని దుయ్యబట్టారు. గిరిజన సంక్షేమానికి కనీసం పదివేల కోట్ల రూపాయిలు కేటాయించాల్సిందని అభిప్రాయపడ్డారు. అంగన్ వాడీలకు కంటితుడుపు వేతనాలు పెంచారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement