నేడు సునీతారెడ్డి నామినేషన్‌

Suneetha Reddy to File Nomination Today Narsapur - Sakshi

సాక్షి, నర్సాపూర్‌: కాంగ్రెస్‌ పార్టీ నర్సాపూర్‌  నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతారెడ్డి పేరును సోమవారం ప్రకటించింది. ఆమె 1999లో మొదటి సారి నర్సాపూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వరుసగా గెలిచి హ్యాట్రిక్‌ విజయం సాధించారు.  సునీతారెడ్డి ఈనెల 14న నామినేషన్‌ దాఖలు చేయనున్నారని తెలిసింది.

పేరు: వాకిటి సునీతాలక్ష్మారెడ్డి
భర్త పేరు: దివంగత లక్ష్మారెడ్డి (శివ్వంపేట మాజీ జెడ్పీటీసీ)
గ్రామం: గోమారం, శివ్వంపేట మండలం
కుటుంబ నేపథ్యం: మామ దివగంత వాకిటి రాంచంద్రారెడ్డి, శివ్వంపేట ఎంపీపీ (వాకిటి రాంచంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి  గోమారం సర్పంచులుగా పనిచేశారు.)
కొడుకులు: శ్రీనివాస్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి
కోడళ్లు: కీర్తిరెడ్డి, రుత్విక్‌రెడ్డి
పుట్టినతేదీ, స్థలం: 05–04–1968, సికింద్రాబాద్‌
విద్యార్హతలు: బీఎస్సీ, వనిత మహావిద్యాలయం, హైదరాబాద్‌

రాజకీయ చరిత్ర:

  • 1999లో జరిగిన ఎన్నికలలో నర్సాపూర్‌ నుంచి మొదటి సారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ అభ్యర్థి చిలుముల విఠల్‌రెడ్డిపై గెలుపొందారు. (నర్సాపూర్‌ నుంచి మొదటి మహిళ ఎమ్మెల్యేగా చరిత్ర కెక్కారు.)
  • 2004, 2009లో జరిగిన సాధారణ ఎన్నికలలో పోటీ చేసి గెలుపొంది ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ సాధించారు.
  • 2009లో  రాష్ట్ర మైనర్‌ ఇర్రిగేషన్‌ మంత్రిగా పని చేశారు.
  • 2010 నుంచి 2014 వరకు  ఐకేపీ, పింఛన్లు, వికలాంగుల మంత్రిగా పని చేశారు.
  • 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం  మెదక్‌ పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు.
  • 2014 నుంచి మెదక్‌ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top