రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే..! | Suicide of farmers in Loan waiver is not clear | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే..!

Mar 15 2016 2:30 AM | Updated on Nov 6 2018 7:53 PM

రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే..! - Sakshi

రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే..!

రాష్ట్రంలో కరువుల పరిస్థితుల వల్ల పంట దిగుబడి రాక, అప్పులు పెరి గిపోరుు రైతులు ఆత్మహత్యకు ....

రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న
రైతు కుటుంబానికి పరామర్శ

 
బజార్‌హత్నూర్ : రాష్ట్రంలో కరువుల పరిస్థితుల వల్ల పంట దిగుబడి రాక, అప్పులు పెరి గిపోరుు రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న విమర్శించా రు. మండలంలోని వర్తమన్నూర్ గ్రామానికి చెందిన రైతు కుర్మే అడెల్లు ఈ నెల 11న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సోమవారం అడెల్లు కుటుం బాన్ని బొర్రన్న పరమార్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా కరువు తాండవిస్తోం దని తెలిపారు.

ప్రభుత్వం ఒకే దఫా రుణమాఫీ చేయకపోవడంతో ప్రైవేటు అప్పులు పెరిగిపోయాయని, అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేసి ఆత్మహత్యలను నివారించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన రైతు కుటుంబంలో ఒకరికి ప్రభు త్వ ఉద్యోగం ఇవ్వాలని, ప్రభుత్వ, ప్రవే టు రుణాలను మాఫీ చేయాలని తెలిపా రు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం నాయకులు దిలీప్‌రెడ్డి, లక్ష్మణ్, సర్పంచ్ భాస్కర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ అల్లం రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement