తీవ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎస్ఐ సిద్ధయ్య భార్య ధరణి శనివారం రాత్రి మగబిడ్డకు జన్మినిచ్చింది.
హైదరాబాద్:తీవ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎస్ఐ సిద్ధయ్య భార్య ధరణి శనివారం రాత్రి మగబిడ్డకు జన్మనిచ్చింది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఎస్ ఐ సిద్ధయ్య కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అదే ఆస్పత్రిలో ఎస్ఐ భార్య ప్రసవించింది.
ఇదిలా ఉండగా సిద్ధయ్యకి ఇంకా చికిత్స కొనసాగుతోంది. అతని తలభాగానికి మొత్తం చికిత్స చేస్తున్నారు. రెండు బుల్లెట్లు తలలోకి, ఒకటి ఛాతిలో, మరొకటి కడుపులోకి దూసుకుపోగా.. మూడు బుల్లెట్లను తొలిగించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. అయితే తలలోకి ఉన్న ఒక బుల్లెట్ను తొలగించేందుకు సగం వరకు ప్రయత్నాలు చేసి మధ్యలో విరమించుకున్నారు. ఎస్ఐ ఆరోగ్య పరిస్థితి పై ఆదివారం ఉదయానికి స్పష్టత రానుంది.