breaking news
stomoch operation
-
కడుపులో కత్తులు.. చెంచాలు.. బ్రష్‌లు..!
సిమ్లా : కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తిని పరీక్షించిన వైద్యులు అవాక్కయ్యారు. అతని కడుపులో 8 చెంచాలు, 2 బ్రష్‌లు, 2 స్క్రూడ్రైవర్లు, ఓ క్తతి, డోర్‌లాచ్ ఉన్నట్లు గుర్తించి చికిత్స అందించారు. ఈ వింత ఆపరేషన్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండిజిల్లాలోని శ్రీలాల్బహుదూర్ శాస్త్రి ప్రభుత్వ ఆసుప్రతిలో జరిగింది. కరణ్సేన్(35) అనే మానసిక స్థితి సరిగ్గా లేని ఆ రోగి.. కొద్ది రోజుల క్రితం తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండగా.. కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కరణ్సేన్ కడుపులో కత్తి ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. కరణ్సేన్ను పరిశీలించి పరీక్షలు జరిపిన వైద్యులు.. అతని కడుపులో ఒక్క కత్తే కాకుండా ఇతర వస్తువులు ఉన్నాయని గుర్తించి షాకయ్యారు. వెంటనే ముగ్గురు సర్జన్స్ 4 గంటలపాటు శ్రమించి అతని కడుపులోని వస్తువులను తొలగించారు. ఇది వైద్యచరిత్రలోనే అత్యంత అరుదైన ఘటనగా అభివర్ణించారు. దీనికి గల కారణాన్ని తెలుసుకున్న వైద్యుల బృందం.. మాములు మనుష్యుల ఎవరు ఇలా మెటాలిక్ వస్తువులను తినరని, అతను మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు కాబట్టి వాటిని ఆహరంగా తీసుకున్నాడని తెలిపారు. ప్రస్తుతం ప్రాణపాయం నుంచి బయటపడ్డారని, అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. -
మగబిడ్డకు జన్మనిచ్చిన ఎస్ఐ సిద్ధయ్య భార్య
హైదరాబాద్:తీవ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎస్ఐ సిద్ధయ్య భార్య ధరణి శనివారం రాత్రి మగబిడ్డకు జన్మనిచ్చింది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఎస్ ఐ సిద్ధయ్య కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అదే ఆస్పత్రిలో ఎస్ఐ భార్య ప్రసవించింది. ఇదిలా ఉండగా సిద్ధయ్యకి ఇంకా చికిత్స కొనసాగుతోంది. అతని తలభాగానికి మొత్తం చికిత్స చేస్తున్నారు. రెండు బుల్లెట్లు తలలోకి, ఒకటి ఛాతిలో, మరొకటి కడుపులోకి దూసుకుపోగా.. మూడు బుల్లెట్లను తొలిగించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. అయితే తలలోకి ఉన్న ఒక బుల్లెట్‌ను తొలగించేందుకు సగం వరకు ప్రయత్నాలు చేసి మధ్యలో విరమించుకున్నారు. ఎస్ఐ ఆరోగ్య పరిస్థితి పై ఆదివారం ఉదయానికి స్పష్టత రానుంది. -
ఎస్ఐ తలలో రెండు బుల్లెట్లు
హైదరాబాద్: తీవ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎస్ఐ సిద్ధయ్యకి ఇంకా చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. తలభాగానికి మొత్తం చికిత్స చేస్తున్నామన్నారు. రెండు బుల్లెట్లు తలలోనూ, ఒకటి ఛాతిలో, మరొకటి కడుపులో ఉందని వైద్యులు తెలిపారు. ఛాతిలోని బుల్లెట్‌ను తొలగించేందుకు సగం వరకు ప్రయత్నాలు చేసి మధ్యలో విరమించుకున్నమన్నారు. రేపు ఉదయానికి ఎస్ఐ ఆరోగ్య పరిస్థితి పై స్పష్టత వస్తుందని తెలిపారు. పది మందిపైగా డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారని వైద్యులు వివరించారు. గర్భణీ అయిన సిద్ధయ్య భార్యకు కూడా అదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.