తీవ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎస్ఐ సిద్ధయ్యకి ఇంకా చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు.
హైదరాబాద్: తీవ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎస్ఐ సిద్ధయ్యకి ఇంకా చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. తలభాగానికి మొత్తం చికిత్స చేస్తున్నామన్నారు. రెండు బుల్లెట్లు తలలోనూ, ఒకటి ఛాతిలో, మరొకటి కడుపులో ఉందని వైద్యులు తెలిపారు. ఛాతిలోని బుల్లెట్ను తొలగించేందుకు సగం వరకు ప్రయత్నాలు చేసి మధ్యలో విరమించుకున్నమన్నారు. రేపు ఉదయానికి ఎస్ఐ ఆరోగ్య పరిస్థితి పై స్పష్టత వస్తుందని తెలిపారు.
పది మందిపైగా డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారని వైద్యులు వివరించారు. గర్భణీ అయిన సిద్ధయ్య భార్యకు కూడా అదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.