మార్కులు తగ్గాయని విద్యార్థిని ఆత్మహత్య | Student suicide | Sakshi
Sakshi News home page

మార్కులు తగ్గాయని విద్యార్థిని ఆత్మహత్య

Sep 9 2017 3:04 AM | Updated on Nov 6 2018 8:08 PM

మార్కులు తగ్గాయని విద్యార్థిని ఆత్మహత్య - Sakshi

మార్కులు తగ్గాయని విద్యార్థిని ఆత్మహత్య

మార్కులు తక్కువగా వచ్చాయి, ఇక ఉద్యోగం రావడం కష్టమని భావించిన ఓ బీటెక్‌ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.

హైదరాబాద్‌: మార్కులు తక్కువగా వచ్చాయి, ఇక ఉద్యోగం రావడం కష్టమని భావించిన ఓ బీటెక్‌ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో జరిగింది.

హయత్‌నగర్‌ డివిజన్‌లోని ఆంధ్రాబ్యాంక్‌ కాలనీలో నివసించే ఏనెపల్లి శ్రీమన్నారాయణ కుమార్తె మౌనిక (24) అవంతి ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతోంది. క్రితం జరిగిన పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చాయని తరచుగా బాధపడేది. ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురైంది. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement