ముదిరిన పంచాయితీ

Stir Attack Case In Mahabubnagar - Sakshi

మిడ్జిల్‌(జడ్చర్ల):  మండలంలోని వల్లబ్‌రావుపల్లి లో ఆదివారం ఉద్రిక పరిస్థితి చోటుచేసుకుంది. పాతకక్షల నేపథ్యంలో జరిగిన గొడవ ముదిరి ఓ వర్గంవారిపై మరో వర్గం దాడులకు దిగింది. దీంతో ఏడుగరికి గాయాలయ్యాయి. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలిలా..
 
మొహర్రం నాటి గొడవ  
గత మొహ్రరం పండుగ సందర్భంగా వల్లభ్‌రావుపల్లిలో ముదిరాజ్‌ కులానికి చెందిన నర్సింహ చేతివేలిని జంగం రామ్‌గౌడ్‌ కొరకడంతో గొడవ ప్రా రంభమైంది. అప్పట్లో ఇరువర్గాల వారు సర్దిచెప్పడంతో సద్దుమణిగింది. అయితే, ఆ గొడవను దృష్టిలో ఉంచుకుని శనివారం సాయం త్రం రామ్‌గౌడ్‌.. బండారి కృష్ణయ్యను రాయితో కొట్టగా ముదిరాజ్‌ కులస్తులు రా మ్‌గౌడ్‌ను నిలదీశారు. అక్కడ మాటమాట పెరగగా రామ్‌గౌడ్‌కు రెండు చెంపదెబ్బలు కొట్టి ఇంటికి పంపించారు.

ఈ విషయాన్ని ఆయన తన కుటుంబీలకు చెప్పడంతో రామ్‌గౌడ్‌తో పాటుగా జంగయ్యగౌడ్, మహేష్‌గౌడ్, శ్రీకాంత్‌ గౌడ్, ఆంజనేయులు గౌడ్, రవికుమార్‌ గౌడ్‌ కలిసి తాటిచెట్లు గీసే కత్తులతో ముదిరాజ్‌వర్గం వారిపై మెరుపు దాడికి దిగారు. ఈ ఘటనలో బండారి కృష్ణయ్య, నర్సింహ, నరేష్, యాదగిరి, భగవంత్, ఆనంద్, గండేలుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్సనిమిత్తం మహబూబ్‌నగర్‌ జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తరలించారు.

పరిశీలించిన ఎస్పీ  
వల్లభ్‌రావుపల్లిలో ఆదివారం ఉదయం కత్తులతో దాడి చేసిన ఘటన గురించి తెలుసుకున్న ఎస్పీ రెమా రాజేశ్వరి వివరాలు ఆరాతీశారు. సాయంత్రం గ్రామానికి వచ్చి గ్రామస్తులతో మాట్లాడారు. ఎస్పీవెంట డీఎస్పీ భాస్కర్‌గౌడ్, సీఐ రవీంర్‌రెడ్డి, ఏఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top