నగరంలోని బహదూర్‌పురా రామాటాకీస్ పక్కన ఉన్న మల్లన్న ఆలయంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు స్వామి విగ్రహానికి నిప్పంటించేందుకు యత్నించారు.
చార్మినార్: నగరంలోని బహదూర్‌పురా రామాటాకీస్ పక్కన ఉన్న మల్లన్న ఆలయంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు స్వామి విగ్రహానికి నిప్పంటించేందుకు యత్నించారు. ఆ క్రమంలో అక్కడే ఉన్న అమ్మవారి విగ్రహానికి నిప్పంటుకుని వస్త్రాలు కాలిపోయాయి. గురువారం ఉదయం ఆలయంలోకి వెళ్లిన పూజారి విషయాన్ని గమనించి బహదూర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. చార్మినార్ ఏసీపీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ కౌశిక్ తెలిపారు.