నల్లగొండ ప్రభుత్వం ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పార్టీలకతీతంగా పనిచేయాలి తప్ప గులాబీజెండా పట్టుకునే వారికే పథకాలు
నల్లగొండ ప్రభుత్వం ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పార్టీలకతీతంగా పనిచేయాలి తప్ప గులాబీజెండా పట్టుకునే వారికే పథకాలు వర్తిస్తాయని రాష్ట్రమంత్రి జగదీష్‌రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యాలు చేయడం దారుణమని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండకు వచ్చిన ఆయన తన స్వగృహంలో జన్మదిన వేడుకలను జరుపుకున్న అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులకు పెద్దపీట వేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ తెలంగాణ వ్యతిరేక పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులకు పదవులు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. నియోజకవర్గంలోని లక్షమంది ప్రజలకు పార్టీలకతీతంగా ప్రతీక్ ఫౌండేషన్ తరఫున బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణ గౌడ్, ఎంపీపీ దైద రజిత, జెడ్పీటీసీ తుమ్మల రాధ, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.