breaking news
State minister Jagadish Reddy
-
జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలి: పొన్నం
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్సుమెంటు వ్యవహారంలో ముడుపులు తీసుకున్న రాష్ట్రమంత్రి జగదీశ్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి జగదీశ్‌రెడ్డిపై చేసిన ఆరోపణలను నిరూపించడానికి తనకో వేదిక కావాలన్నారు. మంత్రిగా జగదీశ్‌రెడ్డి పదవిలో కొనసాగుతున్నంత కాలం ఈ కేసు విచారణపై ప్రభావం పడుతుందన్నారు. లోకాయుక్త మూడుసార్లు అడిగినా ప్రభుత్వం ఎందుకు నివేదికను ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఓయూ విద్యార్థులపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అనుచితంగా మాట్లాడటం మంచిది కాదని హెచ్చరించారు. -
మంత్రి వ్యాఖ్యలు దారుణం : కోమటిరెడ్డి
నల్లగొండ ప్రభుత్వం ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పార్టీలకతీతంగా పనిచేయాలి తప్ప గులాబీజెండా పట్టుకునే వారికే పథకాలు వర్తిస్తాయని రాష్ట్రమంత్రి జగదీష్‌రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యాలు చేయడం దారుణమని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండకు వచ్చిన ఆయన తన స్వగృహంలో జన్మదిన వేడుకలను జరుపుకున్న అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులకు పెద్దపీట వేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ తెలంగాణ వ్యతిరేక పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులకు పదవులు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. నియోజకవర్గంలోని లక్షమంది ప్రజలకు పార్టీలకతీతంగా ప్రతీక్ ఫౌండేషన్ తరఫున బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణ గౌడ్, ఎంపీపీ దైద రజిత, జెడ్పీటీసీ తుమ్మల రాధ, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.