కరోనా నియంత్రణకు కళాకారుల గీతాలు  | Srinivas Goud Launched The Awareness Songs Of Coronavirus | Sakshi
Sakshi News home page

కరోనా నియంత్రణకు కళాకారుల గీతాలు 

Apr 6 2020 3:59 AM | Updated on Apr 6 2020 3:59 AM

Srinivas Goud Launched The Awareness Songs Of Coronavirus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ మహమ్మారి నియంత్రణ చర్యలో భాగంగా కళాకారులు సైతం నడుం బిగించారు. తమ వంతుగా అవగాహన గీతాలను రూపొందించారు. ఈమేరకు ఆదివారం మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గీతాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ఈ అవగాహన గీతాలను రచించిన రచయితలను, గాయకులను అభినందించారు. కరోనా వైరస్‌ నియంత్రణ కోసం సీఎం కేసీఆర్‌ అనుక్షణం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, దర్శకుడు నరేందర్‌గౌడ్‌ నంగునూరి, ప్రముఖ గీత రచయిత, సాంస్కృతిక సారథి కళాకారుడు అభినయ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement