కాలేజీ హాస్టళ్ల నిధుల సమస్యకు స్వస్తి | Social Welfare college hostels releaf from probloms | Sakshi
Sakshi News home page

కాలేజీ హాస్టళ్ల నిధుల సమస్యకు స్వస్తి

Nov 29 2016 2:16 AM | Updated on Sep 4 2017 9:21 PM

సాంఘిక సంక్షేమ కళాశాల విద్యార్థుల వసతిగృహాలకు నిధుల సమస్య నుంచి విముక్తి లభించింది.

అవసరమైనప్పుడల్లా నిధులు విడుదల
160 హాస్టళ్లకు రూ.100 కోట్లతో ప్రత్యేక బడ్జెట్ 

 సాక్షి, హైదరాబాద్: సాంఘిక సంక్షేమ కళాశాల విద్యార్థుల వసతిగృహాలకు నిధుల సమస్య నుంచి విముక్తి లభించింది. గతంలో పాఠశాల వసతి గృహాలకు నిధులిచ్చిన సమయంలోనే వీటికీ నిధులు విడుదల య్యేవి. కొన్నిసార్లు నిధులకు నెలల తరబడి జాప్యం జరిగిన సందర్భాలున్నారుు. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బందులు తలెత్తే అవకా శం లేదు. ఇకపై అవసరమైనప్పుడు నిధులు పొందేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పిం చింది. ఇందుకు ప్రత్యేకంగా రూ.100 కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల నిర్వహణ, ఖర్చులకు సంబంధించి మార్గ దర్శకాలను కూడా విడుదల చేసింది.

ప్రత్యేక బడ్జెట్ ద్వారా వసతిగృహాల్లో లైబ్రరీలు సైతం ఏర్పాటు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంతో భవిష్య త్తులో ఈ హాస్టళ్లు మరింత అభివృద్ధి చెందు తాయని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు కరుణాకర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో రాష్ట్రంలో 160 కాలేజీ హాస్టళ్లున్నారుు. ఇందులో 77 బాలుర, 83 బాలికల వసతి గృహా లుండగా.. 20వేల మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ప్రతిరోజూ మూడు పూటలా భోజనాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటివరకూ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో విద్యార్థులకు భోజన సౌకర్యంలో ఇబ్బందులు తలెత్తేవి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఊరటనిచ్చినటై్లంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement