ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం బామ్ని(బి) గ్రామ అటవీ ప్రాంతంలో కదం శంకర్(45) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
కుంటాల: ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం బామ్ని(బి) గ్రామ అటవీ ప్రాంతంలో కదం శంకర్(45) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన శంకర్ తిరిగి రాలేదు. అయితే, అటవీ ప్రాంతంలో వెళ్తున్న వాళ్లు ఓ గుర్తుతెలియని మృతదేహం కంటపడటంతో పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.