టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయశక్తిగా బీజేపీ | Shame that he plans to tell owned | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయశక్తిగా బీజేపీ

May 29 2016 2:17 AM | Updated on Mar 29 2019 9:31 PM

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయశక్తిగా బీజేపీ - Sakshi

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయశక్తిగా బీజేపీ

కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వమే చేపట్టినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు అని బీజేపీ....

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయశక్తిగా బీజేపీ
 బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.సుగుణాకర్‌రావు


ముకరంపుర : కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వమే చేపట్టినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.సుగుణాకర్‌రావు ఆరోపించారు. కరీంనగర్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్రం నుంచి రూ.80లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణాలకు 90 శాతం నిధులు కేంద్రమే ఇస్తున్నట్లు తెలిపారు. ఉపాధిహామీ, పెన్షన్‌రూపంలో నెలకు కనీసం రూ.5 లక్షలు గ్రామపంచాయతీలకు వస్తున్నాయన్నారు. జిల్లాలో మూతబడిన జాతీయ ఎరువుల కర్మాగారాన్ని తిరిగి పునరుద్దరించారని, ఎన్టీపీసీ పవర్‌కెపాసిటీని 2 వేల మెగావాట్లకు పెంచారని, పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైన్‌కు నిధులు కేటాయించారని తెలిపారు.

కేంద్రం ఇచ్చిన రూ.791 కోట్ల కరువు నిధులు ఎక్కడ ఖర్చు చేశారో స్పష్టం చేయూలని కోరారు.  తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయశక్తిగా బీజేపీ ఆవిర్భవించనుందని తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం హైదరాబాద్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరవుతున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి మండల, ఆపై స్థాయి కార్యకర్తలు, నాయకులను ఆహ్వానిం చినట్లు చెప్పారు.   బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త శ్రీనివాస్‌రెడ్డి, నా యకులు కన్నెబోయిన ఓదెలు, గుజ్జ సతీశ్, లింగంపల్లి శంకర్, హరికుమార్‌గౌడ్, సునీల్‌రావు, వేణు, మారుతి, ప్రశాంత్, కిషోర్ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement