ఏపీఎండీసీ ఎండీగా షాలినీ మిశ్రా | Shalini Mishra appointed as APMDC MD | Sakshi
Sakshi News home page

ఏపీఎండీసీ ఎండీగా షాలినీ మిశ్రా

Oct 18 2014 2:07 AM | Updated on Sep 2 2017 3:00 PM

ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ)కు ఎండీగా షాలినీ మిశ్రాను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చే శారు.

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ)కు ఎండీగా షాలినీ మిశ్రాను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చే శారు. ప్రస్తుతం షాలినీ మిశ్రా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ప్రస్తుతం ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల శాఖ ముఖ్యకార్యదర్శిగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతల్లో కూడా కొనసాగుతారు.  
 
 సెర్ప్ సలహాదారుగా రామలక్ష్మి
 సెర్ప్ కన్సల్టెంట్‌గా ఇటీవల నియమితులైన రిటైర్డు ఐఎఫ్‌ఎస్ అధికారి రామలక్ష్మి హోదాను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెర్ప్ కన్సల్టెంట్‌కు బదులుగా సెర్ప్ సలహాదారు హోదాలో ఆమె విధులు నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement