సెక్షన్‌ 49 పీ.. చట్టం | Section 49( P) Of Indian Penal Code | Sakshi
Sakshi News home page

సెక్షన్‌ 49 పీ.. చట్టం

Nov 24 2018 12:34 PM | Updated on Nov 24 2018 12:36 PM

Section 49( P) Of Indian Penal Code - Sakshi

సాక్షి, దమ్మపేట: ఒక్కోసారి ఎన్నికల్లో దొంగ ఓట్లు కూడా వేస్తుంటారు. పోలింగ్‌ సమయంలో ఏజెంట్లు అప్రమత్తంగా లేని సమయంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన కార్యకర్తలు అవతలి వ్యక్తుల ఓటును వేసేసి వెళ్తుంటారు. అయితే మన ఓటు హక్కును తిరిగి సాధించుకునేందుకు ఎన్నికల చట్టం అవకాశం కల్పిస్తోంది. సెక్షన్‌ 49 పీ ప్రకారం. తన ఓటును మరొకరు వేసినట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత పోలింగ్‌ కేంద్రలో చాలెంజ్‌ ఓటును నమోదు చేసుకోవచ్చు. 
కాండక్ట్‌ ఆఫ్‌ ఎలక్షన్‌ రూల్స్‌ 1961లోని సెక్షన్‌ 49 పీ ప్రకారం..
పోలింగ్‌ సమయంలో మన ఓటు ఎవరైనా అంతకుముందే వేసినట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఆ ఓటును వెనక్కి తీసేయమని అధికారులను కోరవచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇందరు కోసం రూ.5 అక్కడి ప్రిసైడింగ్‌ అధికారికి చెల్లించి ఓటనును నమోదు చేయాలని కోరితే.. అతని వద్ద ఉన్న గుర్తింపుకార్డు తదితరాలన్నింటినీ పరిశీలించి అనుమతి ఇస్తారు. మొత్తం ఓట్లలో అదనపు ఓటుగా ప్రత్యేకంగా గుర్తిస్తూ ఈ ఓటును కలిపి లెక్కించకుండా దాచి ఉంచుతారు. ఓట్ల లెక్కింపు సమయంలో బ్యాలెట్‌పై మనం వేసిన ఓటును ఓట్ల లెక్కింపులో చివరికి లెక్కిస్తారు. గెలుపు ఓటముల్లో ఈ ఓటు అవసరాన్ని బట్టి దీనిని అప్పుడు పరిగణనలోకి తీసుకుంటారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement