
స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు అన్ని విధాలా ప్రోత్సాహం
స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు ప్రోత్సాహం అందించి తెలంగాణ రాష్ట్ర యూనిట్‌ను దేశంలోనే నంబర్ వన్‌గా నిలుపుతామని
స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా కల్వకుంట్ల కవిత ప్రమాణం
హైదరాబాద్: స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు ప్రోత్సాహం అందించి తెలంగాణ రాష్ట్ర యూనిట్‌ను దేశంలోనే నంబర్ వన్‌గా నిలుపుతామని నిజామాబాద్ ఎంపీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కమిషనర్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ నెల 13 తర్వాత రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకెళతామన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆమె స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర తొలి చీఫ్ కమిషనర్‌గా ప్రమాణం చేశారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏపీ, తెలంగాణ కామన్ అడ్మినిస్ట్రేటర్ కేపీ మిశ్రా ఆమెతో ప్రమాణం చేయించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు అంకితభావం, సేవాభావంతో పని చేసే వారని, గతంలో వేల సంఖ్యలో ఉన్న స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం వందల్లోకి తగ్గిందని చెప్పారు. స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో విద్యార్థులను చేర్చేలా ప్రైవేట్ పాఠశాలలను భాగస్వాములను చేస్తామని, ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం అందేలా కృషి చేస్తామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ దేశాభివృద్ధిని కాంక్షిస్తూ, సమాజాన్ని బాగు చేసే దిశలో సాగే స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతగా ప్రోత్సహించడంలేదన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఎంపీ కవిత.. ఈ కార్యక్రమంలో నేషన ల్ హెడ్ క్వార్టర్స్ డెరైక్టర్ సుకుమార, ఏపీ రాష్ట్ర చీఫ్ కమిషనర్ ఆర్‌కే శశిధర్ తదితరులు పాల్గొన్నారు.