నన్నే సస్పెండ్‌ చేస్తారా.. మీ భరతం పడతా: సర్వే

 Sarvey Sathyanarayana Fires On TPCC Leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడంపై కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. తాను ఏఐసీసీ సభ్యుడినని, తనను సస్పండ్‌ చేసే అధికారం పీసీసీలో ఎవ్వరికీ లేదని తీవ్ర స్థాయిలో ఫైర్‌ అ‍య్యారు. గతంతో కేంద్రమంత్రిగా వ్యవహరించానని, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీకి విధేయుడినని సర్వే అన్నారు. ఉత్తమ్‌, కుంతియా వల్లనే పార్టీ ఓడిపోయిందని, ఓటమికి కారణమైనవాళ్లే సమీక్ష చేయడమేంటని ప్రశ్నించానని ఆయన పేర్కొన్నారు. అసలు కాంగ్రెస్‌ అధిష్టానం వీరికి సమీక్ష చెయ్యమని చెప్పలేదని, ఎన్నికల్లో పోటీ చెయ్యని వాళ్లు సమీక్ష సమావేశంలో ఉండటమేంటని ఆయన ప్రశ్నించారు.

కొందరు కావాలనే తనపైకి రౌడీ ముకలను ఎగదోషారని, అందుకే వారికి గట్టిగా సమాధానం చెప్పానని సర్వే వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్‌, కుంతియాలు టికెట్లు అమ్ముకున్నారని, టీఆర్‌ఎస్‌కు వారు కోవర్టులుగా పనిచేశారని ఆరోపించారు. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని, రెండు రోజుల్లో వాటితో అధిష్టానం వద్ద ఫిర్యాదు చేస్తానని తెలిపారు. నన్ను పార్టీ నుంచి సస్పండ్‌ చేసినవారిని విడిచిపెట్టేదిలేదని, వారి భరతం పడతానని, పదవులన్నీ ఊడపీకిస్తానని సర్వే హెచ్చరించారు.

టీపీసీసీపై సర్వే సంచలన వ్యాఖ్యలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top