సర్పంచ్ కుటుంబాన్నే బహిష్కరించిన ఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం చింతలూరులో చోటు చేసుకుంది.
నిజామాబాద్: సర్పంచ్ కుటుంబాన్నే బహిష్కరించిన ఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం చింతలూరులో చోటు చేసుకుంది. సర్పంచ్ శోభ కుటుంబాన్ని గ్రామస్థులు బహిష్కరించారు. ఇసుక అక్రమ రవాణాపై అధికారులకు ఫిర్యాదు చేసినందుకు ఈ చర్య తీసుకోవడం గమనార్హం.
బహిష్కరణతో పాటు సర్పంచ్ కుటుంబానికి లక్ష రూపాయల జరిమానా విధించింది గ్రామాభివృద్ధి కమిటీ. సర్పంచ్ కుటుంబాన్ని బహిష్కరించడంపై దళిత సంఘాలు మండిపడ్డారు. చింతలూరు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులపై కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించాయి.