చెక్‌పవర్‌పై వెంటనే జీవో ఇవ్వాలి: తమ్మినేని 

Sarpanch Checkpower rule in Panchayati Raj New Law - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సర్పంచ్‌తో పాటు చెక్‌పవర్‌ ఇచ్చే వారెవరో నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దానికనుగుణం గా జీవో జారీచేయాలని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో కొత్త పాలకమండళ్లు ఏర్పడి మూడు నెలలు దాటుతున్నా నేటికీ పంచాయతీలకు చెక్‌పవర్‌ లేకపోవడం, గ్రామాల్లో మంచినీటి సమస్యతో పాటు, కనీస అవసరాలు తీర డం లేదన్నారు. సిబ్బందికి చెల్లించే అరకొర జీతభత్యాలు కూడా లేక పారిశుధ్య పనులు చాలా చోట్ల నిలిచిపోయాయని ఒక ప్రకటనలో తెలి పా రు. పంచాయతీరాజ్‌ కొత్త చట్టంలో సర్పంచ్, ఉపసర్పంచ్‌ చెక్‌పవర్‌ నిబంధన ఉన్నప్పటికీ, సర్పంచ్‌తో పాటు గ్రామ కార్యదర్శికి చెక్‌పవర్‌ ఇస్తామని ఇటీవలే సీఎం ప్రకటించారన్నారు. జాయింట్‌ చెక్‌పవర్‌ ఎవరికిస్తారనే దానిపై నేటికీ స్పష్టత లేదని, ఎన్నికల కోడ్‌కు, చెక్‌పవర్‌కు సం బంధం లేకపోయినా ప్రభుత్వం దాన్ని సాకుగా చూపుతోందన్నారు. 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు, ఇతర గ్రాంట్స్‌ ఖర్చు చేసేందుకు ప్రభుత్వానికి చట్టబద్ధ ఆటంకమేమీ లేదన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top