అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారిపై ఇసుక మాఫియా తమ ప్రతాపం చూపించింది.
కౌడిపల్లి (మెదక్) : అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారిపై ఇసుక మాఫియా తమ ప్రతాపం చూపించింది. వీఆర్వోపై దాడి చేసి అతన్ని గాయపరిచారు. దీంతో వీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బండపోతుగల్ సమీపంలో మంజీర నది నుంచి ట్రాక్టర్‌ల ద్వారా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో అక్కడికి చేరుకున్న వీఆర్వో ఎల్లయ్య ఇదేంటని ప్రశ్నించడంతో.. ఇసుక మాఫియాకు చెందిన కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. దీంతో వీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.