సేఫ్‌.. సెలూన్‌..

Salon Shops Awareness And Safety on Coronavirus Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సహజంగానే సెలూన్స్‌లో పరిసరాలు ఆరోగ్య భద్రత విషయంలో కొంత ప్రశ్నార్థకంగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ విజృంభణ దశలో సెలూన్స్‌కు సడలింపులు ఇవ్వడం అనేక భయాలను రేకెత్తించింది. అయితే నగరంలో కొంత కాలంగా చక్కని ఆరోగ్యవంతమైన పద్ధతులు అవలంబిస్తున్న సెలూన్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని హామీ ఇస్తున్నాయి. వినియోగదారులు నిరభ్యంతరంగా తమ సేవలు వినియోగించుకోవచ్చని చెబుతున్నాయి. 

‘మొదటి నుంచీ అత్యుత్తమ ఉత్పత్తుల, నాణ్యమైన విధానాలు పాటిస్తున్నాం. ఇప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాం’ అని లాక్మె సెలూన్స్‌ సీఈఓ పుష్కరాజ్‌ అంటున్నారు. నగరంలోని ఈ తరహా బ్రాండెడ్‌ సెలూన్స్‌ ప్రస్తుతం సురక్షిత పద్ధతులను అవలంబిస్తున్నాయి.  
ఆరోగ్య సేతు యాప్‌ ద్వారా సెలూన్‌ సిబ్బందిని, వినియోగదారులను పరిశీలించడం
వినియోగదారుల నుంచి సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫామ్స్‌ తీసుకోవడం. సీనియర్‌ సిటిజన్స్, పిల్లలు వంటి హైరిస్క్‌ వినియోగదారులకు పలు పార్లర్‌ చికిత్సలు నిరాకరించడం.  
సెలూన్స్‌ అసలు సామర్థ్యంలో కేవలం 50శాతం మంది సిబ్బందిని మాత్రమే సేవలకు వినియోగించడం.  
సోషల్‌ డిస్టెన్సింగ్‌కు తగ్గట్టుగా సీటింగ్‌ అమరికలో మార్పు. అపాయింట్‌మెంట్‌ ద్వారా మాత్రమే సేవలు. 

చేతులు తాకే అవకాశం ఉన్న ప్రతి వస్తువు, పరిసరాల డీప్‌ క్లీనింగ్‌ రోజంతా సాగుతుంది.  
సిబ్బందికి మాస్కులు, గ్లవ్స్, విజర్స్,  డిస్పోజబుల్‌ యాప్రాన్స్‌ పంపిణీ
90శాతం సేవలకు సింగిల్‌ యూజ్‌ కిట్స్‌.
స్కిన్, హెయిర్, మేకప్‌ సేవలకు వ్యక్తిగతంగా స్పర్శించడం తగ్గించేందుకు ప్రత్యేకమైన పద్ధతులు.  
అన్ని సేవలకూ బయోగ్రేడబుల్, డిస్పోజబుల్స్‌ వినియోగం.  
ప్రతి పరికరం, ఉత్పత్తి వినియోగించిన అనంతరం తప్పనిసరిగా స్టెరిలైజేషన్‌.
బిల్లింగ్, చెల్లింపుల దగ్గర ఎటువంటి కాంటాక్ట అవసరం లేకుండా చర్యలు.
పోస్ట్‌ కేర్‌ ప్రొడక్టులు కావాల్సిన వారికి కాంటాక్ట్‌ రహితంగా హోమ్‌ డెలివరీ.  

ఈ తరహా జాగ్రత్తలు పాటించే సెలూన్స్‌ నగరంలో కొన్ని మాత్రమే ఉన్నాయి. వినియోగదారులు ఎక్కడైనా ఇతర సెలూన్లకు వెళ్లే ముందు ఈ జాగ్రత్తలు పాటించే వాటిని ఎంపిక చేసుకోవాలని, వీలైతే అక్కడి నిర్వహకులకు సూచించి ప్రత్యేక జాగ్రత్తలు పాటించేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top