యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది.
యాదగిరిగుట్ట (నల్లగొండ) : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. ఆలయ పరిసరాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. మండుతున్న ఎండల కారణంగా భక్తులు తగ్గుముఖం పట్టినట్లు స్థానికులు అంటున్నారు. కేవలం అరగంటలోనే స్వామి అమ్మవార్లను దర్శించుకుని వెళ్లారు. స్వామి వారిని 5 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.