కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన రోడ్డు రవాణా, భద్రతా బిల్లు-2015 ఆర్టీసీకి తీవ్ర నష్టదాయకమని, బిల్లును ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ల జేఏసీ డిమాండ్ చేసింది.
నేడు ఆర్టీసీ ఎండీ కి సమ్మె నోటీసు ఇవ్వనున్న కార్మిక సంఘాలు
సాక్షి, హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన రోడ్డు రవాణా, భద్రతా బిల్లు-2015 ఆర్టీసీకి తీవ్ర నష్టదాయకమని, బిల్లును ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ల జేఏసీ డిమాండ్ చేసింది. బిల్లుకు వ్యతిరేకంగా ఈనెల 30న జాతీయ కార్మిక సంఘాలు నిర్వహించే సమ్మెలో పాలుపంచుకోనున్నట్లు తెలిపింది. బుధవారం ఆర్టీసీ ఎండీని కలసి సమ్మె నోటీసు ఇవ్వాలని జేఏసీ తీర్మానించింది. కార్మికులు సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జేఏసీ నేత కె.రాజిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.