బోగస్‌ ఓటర్లను తొలగించండి 

Remove Fake Votes Demands BJP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఓ రాజకీయ పార్టీకి సహకరించేందుకు వీలుగా ఎన్నికల అధికారులు లక్షలాది బోగస్‌ ఓటర్లను నమోదు చేశారని తెలంగాణ బీజేపీ నేతలు మంగళవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన పలు ఉదంతాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. బోగస్‌ ఓటర్లను ఏరివేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరాను నేతలు కోరారు. బీజేపీ సెంట్రల్‌ కో ఆర్డినేటర్‌ నూనె బాలరాజు, బీజేవైఎం నేత పొన్న వెంకటరమణ తదితరులు కమిషనర్‌ను కలసిన వారిలో ఉన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top