గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయమని జూనియర్ డాక్టర్లు చెప్పడం సరికాదని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజయ్య అన్నారు.
హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయబోమని జూనియర్ డాక్టర్లు చెప్పడం సరికాదని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజయ్య అన్నారు. శాశ్వత ప్రాతిపదికన నియమించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
జూనియర్ డాక్టర్లను చర్చలకు ఆహ్వానించినా వారు రాలేదని రాజయ్య అన్నారు. సోమవారం మళ్లీ చర్చలకు పిలుస్తామని, సమస్య సమసిపోతుందని రాజయ్య విశ్వాసం వ్యక్తం చేశారు.