గాంధీ ఆస్పత్రిలో సేవ చేసే అవకాశమివ్వండి | Raja Singh Request To Allow Him To Serve In Gandhi Hospital | Sakshi
Sakshi News home page

గాంధీ ఆస్పత్రిలో సేవ చేసే అవకాశమివ్వండి

Jun 6 2020 3:31 AM | Updated on Jun 6 2020 3:34 AM

Raja Singh Request To Allow Him To Serve In Gandhi Hospital - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో కరోనా సోకిన రోగులకు సేవ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ శుక్రవారం లేఖ రాశారు. గాంధీలో రోజుకు 10 నుంచి 12 గంటలపాటు తాను రోగులకు సేవ చేయగలనని లేఖలో తెలిపారు. ధూల్‌పేటకు చెందిన ఓ గర్భిణి డాక్టర్లు, సిబ్బంది సరిగ్గా పని చేయకపోవడం వల్ల చనిపోయిందని పేర్కొన్నారు. ఆ మహిళకు సరైన వైద్యం అందించాలని కేటీఆర్, ఈటల రాజేందర్‌కు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్‌  ద్వారా విజ్ఞప్తి చేసినా స్పందించలేదని వాపోయారు. తల్లితో పాటు కడుపులో ఉన్న శిశువు కూడా చనిపోవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement