టీ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు | Sakshi
Sakshi News home page

టీ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు

Published Wed, Jul 16 2014 2:00 AM

టీ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు - Sakshi

* పార్టీ పగ్గాలు చేపట్టే దిశగా జానా పావులు
* ఎమ్మెల్యేలు, ఓడిపోయిన అభ్యర్థులతో 4న భేటీ
* చర్చనీయాంశమైన జానా చర్యలు
* పొన్నాల గుర్రు... హస్తినకు ఫిర్యాదు?!

 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు మొదలైంది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నాయకత్వంపట్ల మొదటి నుంచీ అసంతృప్తితో ఉన్న సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి.. పార్టీ పగ్గాలను తన చేతుల్లోకి తీసుకునేదిశగా పావులు కదుపుతున్నారు. టీపీసీసీ  కార్యక్రమాలను స్వయంగా నిర్వహించేందుకు రంగంలోకి దిగారు. అందులో భాగంగా వచ్చే నెల 4న పార్టీ  ఎమ్మెల్యేలతోపాటు ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులందరితోనూ సమావేశం ఏర్పాటు చేశారు.
 
  గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించడం, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణను రూపొందిం చడం, ప్రజాసమస్యలను శాసనసభా వేదికగా పరిష్కరించేందుకు కృషి చేయడం వంటి అంశాలు ఎజెం డాగా ఖరారు చేశారు. టీపీసీసీకి రథసారథిగా పొన్నాల లక్ష్మయ్య కొనసాగుతున్నా, ఆయన ప్రమే యం లేకుండా జానారెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. జానా చర్యలతో కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరుకు తెర తీసినట్లయిందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
 
 హైకమాండ్ ఆశీస్సులతోనే...?
 సాధారణ ఎన్నికలకు ముందు టీపీసీసీ అధ్యక్ష పగ్గాలు ఆశించి భంగపడ్డ జానారెడ్డి.. అప్పటి నుంచి పొన్నాల నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని పార్టీలో ప్రచారం జరిగింది. కొద్దిరోజుల క్రితం జానారెడ్డి సీఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌కు దీటుగా రాష్ట్రంలో సరైన నాయకత్వాన్ని ప్రజల ముం దుంచడంలో కాంగ్రెస్ విఫలమైందని చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చాయి.  ఈ విషయాన్ని అధిష్టానం పెద్దల దృష్టికి  పొన్నాల తీసుకెళ్లినట్లు తెలిసింది.
 
  తాజాగా జానారెడ్డి సమావేశ ఏర్పాట్లను పొన్నాల జీర్ణించుకోలేకపోతున్నారు.  వారం క్రితం జానారెడ్డి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతోపాటు హైకమాండ్ పెద్దలందరినీ కలిసి వచ్చిన తర్వాతే ఈ సమావేశ నిర్వహణకు సిద్ధం కావడంతో  హైకమాండ్ ఆశీస్సులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. తనను పలుచన చేసేందుకే జానా చర్యలున్నాయని పొన్నాల భావిస్తు న్నట్లు సమాచారం. 4వ తేదీ సమావేశం గురించి కొందరు విలేకరులు పొన్నాల దృష్టికి తీసుకెళ్లగా.. ‘‘అది గెట్ టుగెదర్ సమావేశమని మాత్రమే నాకు తెలుసు. ఎన్నికల్లో ఓటమికి కారణాలు, భవిష్యత్ కార్యాచరణ, పార్టీ బ లోపేతం అజెండాగా సమీక్ష నిర్వహిస్తున్నట్లు నాకు తెలియదు. ఆయన కూడా చెప్పలేదు’’ అని బదులిచ్చారు.

Advertisement
 
Advertisement
 
Advertisement