రాజాసింగే రాయితో కొట్టుకున్నాడు.. : పోలీసులు | Police release Rajasingh Video in Twitter | Sakshi
Sakshi News home page

రాజాసింగే రాయితో కొట్టుకున్నాడు.. : పోలీసులు

Jun 20 2019 12:45 PM | Updated on Jun 20 2019 4:33 PM

Police release Rajasingh Video in Twitter - Sakshi

రాజా సింగే తనకు తాను రాయితో కొట్టుకున్నాడని.. వీడియో ఆధారాలు ఉన్నాయని..

సాక్షి, హైదరాబాద్‌ : జుమ్మెరాత్ బజార్‌లో స్వాతంత్ర్య సమరయోధురాలు రాణి అవంతి భాయ్ విగ్రహాన్ని పెట్టేందుకు రాజాసింగ్‌ ప్రయత్నించారని వెస్ట్‌జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. అనుమతి లేకుండా విగ్రహం పెట్టడంతో అడ్డుకున్నామన్నారు. రాజా సింగ్‌పై తాము ఎలాంటి దాడి చేయలేదని పేర్కొన్నారు. రాజా సింగే తనకు తాను రాయితో కొట్టుకున్నాడని చెప్పారు. దీనికి సంబంధించి వీడియో ఆధారాలు ఉన్నాయని తెలిపారు. పోలీసులపై రాజాసింగ్‌ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. కాగా, దీనికి సంబంధించి వీడియోను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజన్‌కుమార్ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement