సూపర్‌ స్ప్రెడర్లపై పోలీసు శాఖ నజర్‌

Police Department on Super Spreaders - Sakshi

ఆశ వర్కర్లు, ఎస్బీ, పోలీసుల సంయుక్త ఆపరేషన్‌

సొంతూళ్లకు వస్తున్న కూలీలపై ప్రత్యేక దృష్టి

సాక్షి, హైదరాబాద్‌: ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వస్తున్న వలస కూలీలపై పోలీసు శాఖ దృష్టిపెట్టింది. ముఖ్యంగా ముంబై, భివండీ, నాందేడ్‌ ప్రాంతాల్లో కూలి పనులకు వెళ్లిన వారంతా ఇప్పుడు సొంతూళ్లకు వస్తున్నారు. వీరిలో కొం దరు కరోనా పాజిటివ్‌ పేషెంట్లు కూడా ఉన్నారు. ఇంతకాలం లాక్‌డౌన్‌ కారణంగా వారు ఎక్కడా పరీక్షలు చేయించుకోలేదు. సొంతూళ్లకు వస్తున్న వారిలో సూపర్‌ స్ప్రెడర్లు ఉం డే ప్రమాదం ఉండటంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. సూపర్‌ స్ప్రెడర్లు వందలాది కిలోమీటర్ల ప్ర యాణించి, కొత్త ప్రాంతాలకు, కొత్త వ్యక్తులకు వైరస్‌ను వ్యాపింపజేస్తారు. ఏపీ, గుజరాత్, తమిళనా డు, మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగేం దుకు వీరూ కూడా కారణమన్న సంగతి తెలిసిందే.

క్షణాల్లో వాట్సాప్‌ గ్రూపులోకి..
గ్రీన్‌జోన్లుగా ఉన్న పలు జిల్లాల్లో కూడా వలస కూలీల రాకతో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పోలీసులు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోనే వీరికి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైరస్‌ లక్షణాలు ఉన్న వారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. మిగిలినవారి వివరాలు నమోదు చేసుకుని వారి నివాస ప్రాంతం ఏ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి వస్తుందో అక్కడికి సమాచారమిస్తున్నారు. కూలీల గుర్తింపులో గ్రామాలకు చెందిన ఆశ వర్కర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆశ వర్కర్లు, పోలీసులు, వైద్యారోగ్య శాఖ అధికారులతో కోవిడ్‌ వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో వలస కూలీలు, కొత్తవారు, నగరాల నుంచి ఎవరైనా వచ్చిన వెంట నే ఆ సమాచారాన్ని స్థానిక కోవిడ్‌ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు. వీరికి తోడు స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎస్బీ) కూడా రంగంలోకి దిగి సమాచారం సేకరిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top