వరంగల్ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు | police checks in warangal railway station | Sakshi
Sakshi News home page

వరంగల్ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు

May 2 2014 2:47 AM | Updated on Aug 20 2018 9:35 PM

వరంగల్ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు - Sakshi

వరంగల్ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు

చైన్నై రైల్వేస్టేషన్‌లో గురువారం ఉదయం జరిగిన జంట బాంబు పేలుళ్లతో నగరంలోని పోలీసులు అప్రమత్తమయ్యూరు.

మట్టెవాడ, న్యూస్‌లైన్ : చైన్నై రైల్వేస్టేషన్‌లో గురువారం ఉదయం  జరిగిన జంట బాంబు పేలుళ్లతో నగరంలోని పోలీసులు అప్రమత్తమయ్యూరు. వరంగల్ రైల్వేస్టేషన్‌లో బాంబు, డాగ్ స్క్వాడ్‌తో మూడు ప్లాట్‌ఫాంలపై తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన సూట్‌కేసులు, ప్రయాణికుల వస్తువులను పరిశీలించారు. అలాగే వెరుుటింగ్ హాళ్లు, ప్రతీ రైలులోని బోగిలన్నీ తనిఖీ చేశారు. ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, సూట్‌కేసులు కనిపించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రయాణికులను కోరారు. ఈ తనిఖీల్లో జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ సీఐలు రవికుమార్, హరిబాబు, ఎస్సైలు రవిప్రకాష్, శంకరయ్య, స్టాలిన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
 
 కాజీపేట జంక్షన్‌లో..

 కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్‌లో గురువారం రైల్వేపోలీసులు తనిఖీలు చేపట్టారు. చెన్నై రైల్వేస్టేషన్‌లో గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్‌‌స అధికారులు అప్రమత్తమయ్యారు. సికింద్రాబాద్ రైల్వేపోలీస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కాజీపేట రైల్వే పప్రొటెక్షన్ ఫోర్స్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ విజయ్‌కుమార్, కాజీపేట రైల్వే డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాజీపేట ఆర్‌పీఎఫ్ ఏఎస్సైలు చంద్రమౌళి, రాజన్న, ఏడుకొండలు హెడ్‌కానిస్టేబుల్ సర్వర్‌ఖాన్ కాజీపేట జంక్షన్‌లో అనుమానాస్పద వస్తువులు, బ్యాగులను తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేసి విచారించి విడిచిపెట్టారు. పోలీసుల తనిఖీలతో రైల్వేస్టేషన్‌లోని ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లలోనూ ఎస్కార్ట్ పోలీసులను అప్రమత్తం చేసినట్లు రైల్వే పోలీస్ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement