పసుపు పంటకు బోర్డు ఏర్పాటు చేయండి | Please set up the board of the yellow crops | Sakshi
Sakshi News home page

పసుపు పంటకు బోర్డు ఏర్పాటు చేయండి

Jun 13 2014 12:59 AM | Updated on Oct 17 2018 5:55 PM

పసుపు పంటకు బోర్డు ఏర్పాటు చేయండి - Sakshi

పసుపు పంటకు బోర్డు ఏర్పాటు చేయండి

పసుపు రైతులకు ప్రయోజనం కలిగించేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేయాలని నిజామాబాద్ ఎంపీ కవిత గురువారం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలసి విజ్ఞప్తిచేశారు.

కేంద్ర వాణిజ్య మంత్రికి ఎంపీ కవిత వినతి
 
న్యూఢిల్లీ: పసుపు రైతులకు ప్రయోజనం కలిగించేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేయాలని నిజామాబాద్ ఎంపీ కవిత గురువారం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలసి విజ్ఞప్తిచేశారు. తెలంగాణలో పండుతున్న ప్రధాన వాణిజ్య పంటల్లో పసుపు కూడా ఒకటని, అయితే ఈ పంటను శాస్త్రీయ పద్ధతుల్లో పండించేందుకు తగిన మెలకువలు గానీ, ఇతరత్రా సహకారం గానీ రైతులకు అందడం లేదని పేర్కొన్నారు. రైతులు కేవలం స్థానిక విత్తనాలు, రకాలపైనే ఆధారపడుతున్నారని తెలిపారు. ఈ పంట పండిస్తున్నవారిలో ఎక్కువ భాగం చిన్న, సన్నకారు రైతులేనని వివరించారు.

ఇతర సుగంధ ద్రవ్య పంటలకు అందే ఇన్‌పుట్ సబ్సిడీ ఈ ముఖ్యమైన పంటకు మాత్రం ఇవ్వడం లేదని మంత్రికి చెప్పారు. శాస్త్రీయ పద్ధతులు తెలియక రైతులు భారీగా పంట నష్టపోతున్నారని, ఈ పంటను ప్రాసెసింగ్ చేసే సౌకర్యాలు తెలంగాణలో ఎక్కడా లేవని వివరించారు. ప్రస్తుతం పసుపు పంట స్పైసెస్ బోర్డు పరిధిలో ఉందని, ఈ నేపథ్యంలో దీనికి ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేయాలని విన్నవించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ ‘పసుపుపై తగినంత పరిశోధనలు జరగడంలేదు. ఈ పంటకు ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేయాలని నిర్మలా సీతారామన్‌ను కలిశాం. మంత్రి సానుకూలంగా స్పందించారు’ అని పేర్కొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement